రాయదుర్గం: యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఊరువాకాలి అనిల్ కుమార్ నియామకం
కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులుగా గుమ్మగట్ట మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ఊరువాకాలి అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ సుదీర్ఘంగా కసరత్తు చేసి ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహించారు. మెజారిటీ సభ్యులు అనిల్ వైపు మొగ్గు చూపడంతో ఆయన పేరు ఖరారు చేస్తూ మంగళవారం పార్టీ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. పార్టీ కి పూర్వ వైభవం కోసం పని చేస్తానని ప్రకటించారు. షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు.