కనిగిరి: కనిగిరి పట్టణంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర, 500 కలశాలతో మొక్కు చెల్లించిన మహిళలు
కనిగిరిలో ఆధ్యాత్మిక సందడి: అంగరంగ వైభవంగా అమ్మవారి కలశ యాత్ర యాంకర్ పార్ట్: మార్కాపురం జిల్లా, కనిగిరి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ మరియు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శనివారం వేలాది మంది మహిళలతో నిర్వహించిన కలశ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో కనువిందుగా సాగింది. పట్టు వస్త్రాలు ధరించిన వేలాది మంది మహిళలు, నెత్తిన కలశాలతో ఊరేగింపులో పాల్గొని భక్తితన్మయత్వంతో అమ్మవారిని స్మరించుకున్నారు.మంగళ వాయిద్యాలు, భజన కీర్తనలు, మధ్య ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది.ఆలయ పునర్నిర్మాణోత్సవాల నేపథ్యంలో క