రాయదుర్గం: వడ్రహొన్నూరులో సామూహిక వివాహాలు, వధూవరులను ఆశీర్వదించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు
రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు గ్రామ సమీపంలోని ప్రసిద్ధ అపులాపురం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆదివారం సామూహిక వివాహాలు జరిగాయి. తాజా మాజీ సర్పంచ్ కురుబ అంగడి అశోక్ ఆధ్వర్యంలో 18 పేద జంటలకు స్వంత ఖర్చులతో వేదపండితుల ఆశీర్వచనాలతో మంత్రోచ్చారణల మద్య వివాహాల ఘనంగా జరిపించారు. ఈ వివాహామహోత్సవానికి ముఖ్య అతిథిగా TDP జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కె మల్లికార్జున, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయపాటి మురళీ టిడిపి సీనియర్ నాయకులు హిర్దేహాల్ మారెన్న మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.