మార్కాపురం: మార్కాపురం ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలకు విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల అంతరాయం,తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
మార్కాపురం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న కార్గో సేవలు శనివారం అంతరాయం ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వినియోధరులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పార్సిల్స్ బుక్ చేసే వాళ్ళు తీసుకునే వాళ్ళు వెనుతిరిగారు. కనీసం ఇన్వర్టర్ ఏర్పాటు చేసుకోకుండా ఇబ్బందులు కలిగిస్తే ఎలా అని ధన్యవాదాలు ప్రశ్నించగా కారుగో సర్వీసులు అందించే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.