మార్కాపురం: నాయుడు పల్లి గ్రామంలోని గ్రామ సచివాలయం బోర్డుపై జిల్లా పేరు మారకపోవడంతో స్థానికుల నుండి పలు విమర్శలు
మార్కాపురం జిల్లా ఏర్పడి ఆరు నెలలు పూర్తికావస్తుంది. పైన మార్కాపురం మండలం నాయుడు పల్లి లో ఉన్న గ్రామ సచివాలయం బోర్డుపై జిల్లా బోర్డు మారలేదు. జిల్లా ఏర్పడిన వెంటనే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలపై జిల్లా పేరు మార్చాలని ఇన్చార్జి కలెక్టర్ గా ఉన్న రాజబాబు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలను సిబ్బంది పట్టించుకోకుండా ఇంతవరకు పేర్లు మార్చకపోవడంతో పలు విమర్శలకు దారి తీసింది.