మార్కాపురం: రాయవరం లోని ఆర్ సి ఎం చర్చి లో ఘనంగా ఈస్టర్ పండగ నిర్వహించిన పాదర్ జాన్
మార్కాపురం జిల్లా మండలంలోని రాయవరం గ్రామంలో ఆర్ సీఎం చర్చ్ ఫాదర్ జాన్ ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ ఈస్టర్ పండుగను క్రీస్తు పునరుద్ధరణ పండుగ అని కూడా అంటారన్నారు. చరిత్రలో జరిగిన అతి గొప్ప అద్భుతమైన కార్యం యేసుక్రీస్తు పునరుద్ధరణుడై లేవడమే అని అన్నారు. ఇంత గొప్ప అద్భుతాన్ని మనం చూడలేదు భవిష్యత్తులో కూడా చూడబోమని అన్నారు. అందువల్లనే ఈస్టర్ పండుగను పండగలకే పండుగ అని అంటారన్నారు.