మార్కాపురం: మండల స్థాయిలో 1158 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు ఎంఈఓ రామదాస్ నాయక్ వెల్లడి
మార్కాపురం మండల పరిధిలో సుమారు 18 ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని గురువారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని మండల విద్యాశాఖ అధికారి రాందాస్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలో మొత్తం 1270 మంది విద్యార్థులకు గాను 1158 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. మండల స్థాయిలో మొత్తం 91% విద్యార్థులు పాసైనట్లు తెలిపారు. మండల స్థాయిలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 588 మార్కులతో మొదటి స్థానం ఏపీ మోడల్ స్కూల్ లో 583 మార్కులతో రెండవ స్థానంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 578 మార్కులతో మూడో స్థానంలో రావడం