దర్శి: సింగన్నపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్ జానీ మృతి
Darsi, Prakasam | Apr 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం సింగన్నపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐస్ క్రీమ్ తీసుకెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ జానీ అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం క్యాబిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అద్దాలను పగలగొట్టి స్థానికులు బయటికి తీశారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.