యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం జాతీయ రహదారిపై అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు, ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం లోని జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. హైవే సిబ్బంది క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన కారును రోడ్డు పక్కకు తొలగించారు. కనిగిరి నుంచి హైదరాబాద్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.