గిద్దలూరు: రాచర్ల మండలంలోని రంగనాయక స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం మూడవరోజు తెప్పోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మార్కాపురం వైసిపి ఇన్చార్జ్ అన్నా వెంకట రాంబాబు కుటుంబ సమేతంగా రంగనాయక స్వామివారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబును శాలువా పూలమాలతో సన్మానించారు.