గిద్దలూరు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని క్లబ్ రోడ్డులో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ఆయన రచించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులతోపాటు ఎస్సీ నాయకులు పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.