రాయదుర్గం: ఉంతకల్లు క్రాస్ వద్ద రోడ్డుపై కూలిన భారీ వృక్షాలు, స్థంభించిన ట్రాఫిక్
బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు క్రాస్ వద్ద బళ్ళారి - గుండ్లపల్లి రోడ్డులో గాలివాన కు భారీ వృక్షాలు విరిగి రోడ్డుపై పడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రధాన రహదారి కావడంతో ఇరువైపులా వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయి ట్రాఫిక్ స్తంభించింది.