మార్కాపురం: బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన నిర్వాహకులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. వివిధ పార్టీలకు చెందిన విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంభం రోడ్డులో జనసేన, అమ్మవారి శాల బజార్లో వైసిపి, నాయుడు బజార్లో టిడిపి విద్యుత్ ప్రభల ఏర్పాటు పనులు ప్రారంభించామన్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు, ప్రముఖ సింగర్లు, డాన్సర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.