దర్శి: ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామంలో పర్యటించిన వైసిపి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Apr 12, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామంలో వైసిపి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇండ్లు వరిగడ్డి వాము దగ్ధమై నష్టపోయిన బాధితులను పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం అందజేసి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.