యర్రగొండపాలెం: ప్రభుత్వ భూమికి ఢీ పట్టా ఇవ్వాలని త్రిపురాంతకం కోయ కులస్తులు జెసి శ్రీనివాసులకు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో త్రిపురాంతకం చెందిన కోయ కులస్తులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వ భూమికి డి పట్టా ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జెసికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సర్వే నెంబరు 804లో 216.8 సెంట్లు ప్రభుత్వ భూమిలో సాగుకు అనుకూలంగా ఉన్న సుమారు 80 ఎకరాలు భూమిని బాగు చేసుకుని గత 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామన్నారు. బోరు బావి నీటితో మెట్టపైర్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఏ ఆదరులేని మాకు ఆ భూమికి సంబంధించిన డి పట్టాలను ప్రభుత్వం మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు.