గిద్దలూరు: గిద్దలూరులో రైతు సంఘాల సమాఖ్య సమావేశం, రైతుల సమస్యలపై చర్చించిన సంఘం నేతలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వర్షన్ హాల్ లో బుధవారం రైతు సంఘాల సమాఖ్య సమావేశం పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. రైతు సమస్యలపై ఈ కార్యక్రమంలో చర్చించి రైతులు ధైర్యంగా ఉండాలని ఆత్మహత్యలు చేసుకోవద్దని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. పొగాకు మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలపై చర్చించారు. అలానే రైతులకు ఇన్సూరెన్స్ చేయించే విషయంపై చర్చించి రైతులకు ఇన్సూరెన్స్ చేయిస్తామని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.