రాయదుర్గం: రప్పా రప్పా అంటే తాట తీస్తాం : మంత్రి సత్యకుమార్ యాదవ్
శవాలమీద పైసలు ఏరుకునేలా రప్పా రప్పా అంటే తాట తీస్తామని, YCP ని గుంతతీసి పాతిపెట్టి భూస్థాపితం చేస్తామని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ద్వజమెత్తారు. గుమ్మగట్ట మండలం గోనబావి వద్ద స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడారు. బిసి బిడ్డలు చదువుకునే గురుకుల పాఠశాల భవనం వైసిపి హయాంలో అర్దాంతరంగా ఎవరిమీద కక్షతో ఆపేశారని ప్రశ్నించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం MLA సురేంద్రబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి, వైస్ చైర్మన్ దానవేంద్ర పాల్గొన్నారు.