యర్రగొండపాలెం: దోర్నాల పట్టణంలో గుంతలపై మూతలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలోని నటరాజ్ సర్కిల్ వద్ద గుంతలు ముతలేకుండా బహిరంగంగా ఉండడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న గుంతల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో గుంతలు స్పష్టంగా కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొన్నది. మూతలు ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.