మార్కాపురం: తుమ్మలచెరువు గ్రామంలో ఖాసీం స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధులలో పీర్లను ఊరేగింపు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఖాసిం స్వామి దర్గాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు