మార్కాపురం: జిల్లా కేంద్రంలో బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి రామిరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని పూల సుబ్బయ్య కాలనీ అర్బన్ హాస్పిటల్ పక్కన మున్సిపల్ గ్రౌండ్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి పట్టణ ఎస్ఐ విశ్వనాథరెడ్డి పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం యువకులతో ఉత్సాహంగా బాల్ బ్యాట్మెంటన్ ఆడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.