రాయదుర్గం: పని చేయని హెల్ఫ్ లైన్ నెంబర్ తో ప్రజలను బురడీ కొట్టించిన మున్సిపల్ అధికారులు
*శీర్షిక: పని చేయని హెల్ప్‌లైన్ నంబర్.. మున్సిపల్ అధికారుల తీరుపై పట్టణవాసుల ఆగ్రహం* వీధి లైట్లు వెలగడం లేదా? పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయా? తాగునీటి సమస్య ఉందా? అయితే 7995080745 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయండి అంటూ రాయదుర్గం మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వార్డుల్లో పెద్ద ఎత్తున నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఈ నంబర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపాలిటీ ప్రచారం చేసింది. అయితే ఆ నంబర్‌కు ఎప్పుడు ఫోన్ చేసినా 'మీరు డయల్ చేసిన నంబర్ పని చేయడం లేదు' అని సమాధానం వస్తుంది.