దర్శి: క్రిస్టియన్ పాలెం లో సీనియర్ పౌరాణిక కళాకారుడు యోనా అనారోగ్యంతో మృతి i
Darsi, Prakasam | May 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన క్రిస్టియన్ పాలెం సీనియర్ పౌరాణిక కళాకారుడు గర్నపూడి యోనా అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో కళా రంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా సత్య హరిచంద్ర నాటకంలో నక్షత్రుడి పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నదని పలువురన్నారు. అనేక వేదికల పైన నాటకాలు ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు పొందారన్నారు. ఆయన పార్థివ దేహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.