నేలకొండపల్లి: యాసంగిలో తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఎల్నినో నేపథ్యంలో యాసంగిలో తక్కువ నీరు అవసరమయ్యే పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రబీ విత్తన పంపిణీని ప్రారంభించిన ఆయన, సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.