కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త మరియు మాజీ ఎంపీ తలారి రంగయ్య కు ఘన సన్మానం
అనంతపురంలో కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త మరియు మాజీ ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం వైసీపీ నాయకులు గురువారం ఘనంగా సన్మానించారు. వైసీపీ వికలాంగుల విభాగం అధ్యక్షులు పాత లింగ, ఉపాధ్యక్షులు మల్లికార్జున తదితరులు తలారి రంగయ్యను కలిసి సన్మానించారు. వికలాంగుల సంఘం అధ్యక్షులు పాత లింగ మాట్లాడుతూ తలారి రంగయ్య పోరాటాలు, కృషి కారణంగానే ఆర్డీటీ కి ఎఫ్ సీ ఆర్ ఏ రెన్యువల్ అయిందన్నారు. తలారి రంగయ్య ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు.