మార్కాపురం: కొనకనమిట్ల మండలంలోని వివిధ గ్రామాలలో సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే తనయుడు విగ్నేష్ రెడ్డి
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు విగ్నేష్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా ఊరట కలిగించేందుకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని విగ్నేష్ రెడ్డి అన్నారు. సుమారు 16 మందికి 18 లక్షల 47 వేల 293 రూపాయల చెక్కులను స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి అందజేసినట్లు తెలిపారు.