గిద్దలూరు: కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద అడవి పంది అడ్డం రావడంతో ఆటో బోల్తా, పదిమంది కూలీలకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలో శనివారం అడవి పంది రోడ్డుకు అడ్డంగా రావడం వల్ల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలయ్యాయి. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 15 మంది ఆటోలో కూలీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరందరూ మిరప కొత్తలకు కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి గ్రామం నుంచి బేస్తవారిపేట మండలం పూసలపాడు కు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.