మార్కాపురం: తర్లుపాడు మండలం గానుగుపెంట జగనన్న కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలు
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంట జగనన్న కాలనీలో గృహాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో చాలావరకు గృహాలు నిర్మాణం చేసుకోగా మిగిలిపోయిన గృహాలకు బిల్లులు రాకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పేదలకు ఇంటి కల సహకారం కాలేదు. మరోవైపు నీటి కోసం ఏర్పాటు చేసిన బోర్ మరమ్మత్తులు చేయకుండా నిరుపయోగంగా వదిలేశారు. గృహ అవసరాల కోసం వెంటనే బోర్ మరమ్మత్తులు చేయాలని కాలనీవాసులు కోరారు