కొండపి: సింగరాయకొండ లో సైక్లిస్టు ద్విచక్ర వాహనదారుడు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు, అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆదివారం రాత్రి సైక్లిస్టుని ద్విచక్ర వాహనదారుడు వెనకనుంచి ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో సైకిల్పై వెళ్తున్న వ్యక్తితో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ ఇద్దరు సింగరాయకొండకు చెందినవారుగా పోలీసులు తెలిపారు.