దర్శి: మారెళ్ళ గ్రామ శివాలయంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామ శివాలయంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భ్రమరాంబ సమేత చెన్నై మల్లేశ్వర స్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.