మార్కాపురం: చెన్నకేశవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పుష్పయాగం కార్యక్రమం
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 13వ రోజు పుష్పయాగం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 500 కేజీల పుష్పాలు 12 రకాల నైవేద్యాలతో కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉభయ దాతలతో పాటు భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.