మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బండి లక్ష్మీదేవి అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి బాపన రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 17 శాఖలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. మండలంలో జరుగుతున్న సర్ కార్యక్రమంలో అధికారులు పాదర్దర్శకంగా వ్యవహరించాలని ఎంపీపీ లక్ష్మీదేవి సూచించారు. ఉపాధి హామీ పథకం పనులపై జడ్పిటిసి అధికారులను ప్రశ్నించారు.