గిద్దలూరు: కంభం పట్టణంలోని ABM పాలెంలో రెచ్చిపోయిన దొంగలు, ఉపాధ్యాయుడు ఇంటిలో చోరీ, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం మండలంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కంభం పట్టణంలోని ABM పాలెంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉపాధ్యాయుడు ప్రదీప్ కుమార్ ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు రెండు బీరువాలను పగలగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం, రూ.8 వేలు నగదు అపహరించారు. ప్రదీప్ కుమార్ వ్యక్తిగత పనులపై తన కుటుంబ సభ్యులతో ఈనెల 25వ తేదీన కడపకు వెళ్ళాడు. బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీం ను రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్నారు.