కొండపి: 11 స్థానంలో ఇచ్చిన మాజీ సీఎం జగన్ కి బుద్ధి రాలేదు: టంగుటూరులో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు 11 స్థానాలే ఇచ్చిన ఇంకా సిగ్గు రాలేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేపు నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నెకు జగన్ ఎందుకు వస్తున్నారో చెప్పాలని అన్నారు. మీ తండ్రి హయాంలో పోర్టులు వద్దేవద్దని జీవోలు ఇచ్చాడని తాము అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబును జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.