గిద్దలూరు: గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో భారీ వర్షం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఉరుములు మెరుపులు పిడుగులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. అయితే బలమైన ఈదురు గాలుల వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు మెరుపులు పిడుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. అయితే కొన్ని ప్రాంతాలు పిడుగులు పడ్డ ఎటువంటి నష్టం జరిగిందో సమాచారం తెలియవలసి ఉంది.