మార్కాపురం: భూపతి పల్లి గ్రామంలో బ్రతుకు ఉన్న ఉపాధి కూలిని చనిపోయినట్లుగా జాబ్ కార్డు తొలగించిన అధికారులు
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే నిర్లక్ష్యంతో ఒక సామాన్యుడి ప్రాణాలతో చలగాటం ఆడారు. మార్కాపురం మండలం భూపతి పల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి బ్రతికి ఉండగానే చనిపోయినట్లుగా ఉపాధి హామీ అధికారులు జాబ్ కార్డు క్లోజ్ చేశారు. తన జాబ్ కార్డు ఎందుకు క్లోజ్ అయిందో తెలుసుకోవడానికి కార్యాలయానికి వెళ్ళిన భాస్కర్ రెడ్డికి అధికారుల నిర్లక్ష్య సమాధానంతో చేదు అనుభవం ఎదురైందన్నారు.