మార్కాపురం: జిల్లా కేంద్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని నాయి బ్రాహ్మణ మంగళ మన్యంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం హనుమంత వాహనంపై స్వామివారిని పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకారంలో స్వామి అమ్మవార్లకు వేదమంత్రాల మధ్య శాస్రోప్తకంగా పండితులు కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.