గిద్దలూరు: గిద్దలూరు మండలం పాములపల్లి స్మశాన వాటిక సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు, అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి స్మశాన వాటిక సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. గ్రామస్తులు అడ్డుకొని స్థానిక తహసిల్దార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే తమ ప్రాంతానికి సంబంధించిన స్మశాన వాటిక సరిహద్దులు చూపిస్తే తాము సరిహద్దురాలు పాతుకొని సంరక్షించుకుంటామని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి పరిశీలించి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.