కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రాయడంతో పాటు దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. భావితరాలు సైతం ఆయన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.