మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలలో మే 11వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయ సునీత ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలను అర్జీ రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలన్నారు. అదేవిధంగా 1100 నెంబర్ కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే అర్జీ స్థితిని తెలుసుకోవచ్చు అన్నారు.