మార్కాపురం: కంభం పట్టణంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, రంగ కుమార్తె ఆశలత
యాంకర్ వాయిస్.. వంగవీటి మోహన రంగా అంటే ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందిన వాడు కాదని ఆయన అందరి వాడని వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశ లత అన్నారు. మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో వంగవీటి మోహన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహా విష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశ లత విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన కృష్ణదేవరాయలు బలిజ సేవా సంఘం సభ్యులను అనుమతులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.