గిద్దలూరు: కొమరోలు మండలంలో మే 22వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మే 22 శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలు తెలిపారు. కసినపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో చింతలపల్లి, కూరాకువానిపల్లి గ్రామాలలో మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.