గిద్దలూరు: గిద్దలూరు ఫైర్ స్టేషన్ పరిధిలోని మూడు మండలాలలో వేసవికాలంలో 37 అగ్నిప్రమాదాలు: అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఫైర్ స్టేషన్ పరిధిలోని కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాలలో 37 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు మంగళవారం అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. వేసవికాలంలో మొక్కజొన్న పొలాలు, గడ్డివాములు, పూరి గుడిసెలు కాలిపోవడం వల్ల రూ.5 లక్షలకు పైగా నష్టం జరిగిందని చంద్రశేఖర్ అన్నారు. ప్రమాదల నివారణకు ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు.