నంద్యాల అర్బన్: గడువులోగా సోలార్ బిగింపు చర్యలు వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ సూరజ్
Nandyal Urban, Nandyal | Nov 14, 2026
గ్రామాలలో సోలార్ బిగింపులు వేగవంతం చేసి, గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ ఆదేశించారు. శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద మంజూరైన రూఫ్ టాప్ ప్లాంట్ బిగింపులను డిసెంబర్ నెలలోగా 100% పూర్తి చేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు, సామగ్రి కొరత లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు