మార్కాపురం: ప్లాట్ లలో ఉన్న రాళ్లను తొలగించిన వ్యక్తిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించిన బాధితులు
మార్కాపురం అల్లూరి పోలేరమ్మ వెనక ప్రాంతంలో ఫ్లాట్లలో ఉన్న రాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసినదే. ఇవాళ సంబంధిత వ్యక్తి ఆచూకీ దొరకడంతో బాధితులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు నడిపించుకుని వెళ్తున్న సమయంలో రూరల్ ఎస్సై వేమన బాధితులకు నచ్చజెప్పి ఆ వ్యక్తిని జీపులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.