డిచ్పల్లి: డిచ్ పల్లిలో ఘనంగా దుర్గామాత శోభయాత్ర: సందడిగా సాగిన నిమజ్జన వేడుకలు
డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో బ్రహ్మోదయ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత శోభయాత్ర వైభవంగా జరిగింది. తొమ్మిది రోజుల పూజల అనంతరం అమ్మవారిని భక్తులు ఘనంగా సాగనంపారు. ఈ వేడుకల్లో కోలాటాలు, భజనలు, మరియు పూజా సామగ్రి వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.