రాయదుర్గం: కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గా హనకనహల్ కు చెందిన ఎస్కే మల్లికార్జున ఎంపిక
కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గా కణేకల్లు మండలం హనకనహల్ గ్రామానికి చెందిన SK మల్లికార్జున ఎంపికయ్యారు. ఆదివారం కర్నూలు నగరంలో జరిగిన కురుబ సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షులు గా ఎన్నుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన కురుబ పెద్దలకు సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కురుబల సంక్షేమానికి, హక్కుల సాధనకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మల్లికార్జున ప్రకటించారు.