తాడిపత్రి: యాడికి లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్
అనంతపురం జిల్లా యాడికి లో ఈనెల ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న విషయం తెలిసిందే. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం విడుదల చేశారు. ఆరో తేదీ ఉదయం 11:10 గంటలకు యాడికి మండలం లోని వేములపాడుకు చేరుకుంటారు. 11:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదికలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.40 గంటల నుంచి రెండున్నర గంటల మధ్య పెండేకల్లు రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. 2.40 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు వేములపాడు లో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4.20 గంటల కు తిరిగి అమరావతికి పయనం అవుతారు.