కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో, మెయిన్ బజార్ లో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీనియర్ టీడీపీ నేత మల్లికార్జున మాట్లాడారు. ఉప ప్రధానిగా, సంఘసంస్కర్తగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా జగజ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.