రాయదుర్గం: బొమ్మనహాల్ పిహెచ్సి పరిధిలో 589 మందికి వైద్య పరీక్షలు
బొమ్మనహాల్ పిహెచ్సి పరిధిలో 589 మందికి క్యాన్సర్, డయాబెటిస్, x రే టిబి పరీక్షలు నిర్వహించినట్లు ప్రాథమిక అరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చల్లా శ్రీలక్ష్మి తెలియజేశారు. బుధవారం నేమకల్లు, బొమ్మనహాల్ వడ్డే క్యాంప్ కాలనీ లో NCDCD సర్వే స్క్రీనింగ్ ని ఆమె తనికీ చేశారు. బీపీ డయాబెటిక్, క్యాన్సర్ పరీక్షలు సిబ్బంది ఎలా చేస్తున్నారు పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. టీ బీ ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా టీ బీ ని ముందుగా గుర్తించి సరియైన చికిత్స పొందవచ్చని తెలిపారు. సి. హెచ్.ఓ ఈశ్వరయ్య, టీ బీ లాబ్ సూపర్వైజర్ సత్యనారాయణ, అశోక్, అరోగ్యకార్యకర్త నాగేంద్ర పాల్గొన్నారు.