యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో ఏబీఎన్ రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలని స్థానిక వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు స్థానిక వైసీపీ నాయకులు ఏబీఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్యత సంస్కారం లేకుండా వైసిపి నాయకులను వారి కుటుంబాలను మహిళలను దుర్మార్గంగా అనుచితంగా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా ముసుగులో వైసీపీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.